Songtexte.com Drucklogo

Nallani Mabbu Songtext
von Vardhani

Nallani Mabbu Songtext

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా
సరేలే పోనీ అంటూ వెళితే నేనలా
చిటపటలాడి చిందేవెస్తవేంటలా
తెలుసా జడివాన తొలి చినుకై నువ్వు తాకేయగా
తడిసె నెరజాణ సిరి నెమలై కురి విప్పేయగా

ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే
అరే ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే

ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చి నా పైన
చిటుకు చిటుకు అని జారీ చల్లని చినుకై ఎద చేరి


సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూసే
వెలుగైనా చూడని ఒంపుల్లో తనువార జలకమే ఆడే
చనువిస్తే తుంటరి వాన
తొలి ప్రాయం దోచడమేనా
సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా

వింత చేసేనీ వాన కురిసింది కొంత సేపైనా
తడిపి తడిపి నిలువెల్లా తపనై వెలిసి హరివిల్ల
చిరు జల్లు వలచిన ప్రాయాలే మరుమల్లె తీగకారిస్తే
సెలయేటి అద్దమును చూపించి మేరుపల్లె మేనిలో చేరి
చనువిస్తే తుంటరి వాన
తొలి ప్రాయం దోచడమేనా
సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా

ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే
అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer ist auf der Suche nach seinem Vater?

Fans

»Nallani Mabbu« gefällt bisher niemandem.