Songtexte.com Drucklogo

Kallumoosi Songtext
von Suchith Suresan

Kallumoosi Songtext

కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే
రాత్తిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే
తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే
ఊరించకే ఊరించకే ఆ కొంటె చూపుతోటి నన్ను చంపకే
కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా
కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే


ఆ దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే
ఎదురే ఉంటే చూడవులే
నే వెళిపోతుంటే నువు తొంగి చూస్తావులే
నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమలేఖలో
నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే

కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే
తనివి తీరా చూద్దామంటే పారిపోతావే

పుస్తకాల్లో నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే
నీ కదిలే పెదవే చిరుసాక్షమిచ్చిందిలే
నను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో
నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే
సిగ్గు నీకే చాలా అందం ముద్దుముద్దుగ ఉంటావే
ఎంత ముద్దుగ ఉంటే మాత్రం అంత సిగ్గేంటే
ఎంత దాచాలనుకున్నావో అంత బయటే పడతావే
ఎంత మౌనం ఒలికేసావో అంత తెలిసావే
తెలిసిందిలే తెలిసిందిలే నీ మూగ కళ్ళలోని భావమేమిటో
దొరికిందిలే దొరికిందిలే నీ దొంగ నవ్వుకర్థమేమిటో ఇపుడే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Suchith Suresan

Quiz
Welche Band singt das Lied „Das Beste“?

Fans

»Kallumoosi« gefällt bisher niemandem.