Songtexte.com Drucklogo

Parugulu Thiyy Songtext
von S. P. Balasubrahmanyam

Parugulu Thiyy Songtext

హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర
హరోం హరోం హర హర హర హర

పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర
(చర చర చర చర చర)
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర

దడదడ దడదడలాడే
ఎద సడి ఢమరుకమై
వడి వడి వడి వడి దూకే
పదగతి తాండవమై

పంచ ప్రాణముల పంచాక్షరితో
శివుని పిలుచు సంకల్పమై
ముంచుకు వచ్చే మృత్యువుకందని
మార్కండేయుడవై


పరుగులు తీయ్ ఉరకలు వేయ్
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర
బిర బిర బిర బిర
(బిర బిర బిర బిర)
చర చర చర చర
(చర చర చర చర)
బిర బిర చర చర
(బిర బిర చర చర)

కుత్తుక కోసే
కత్తి కొనలు (కత్తి కొనలు)
కుత్తుక కోసే కత్తి కొనలు
దరి దాపుకు చేరని దూకుడువై
ఆయువు తీసే ఆపద కూడా
అలసటతో ఆగేలా చెయ్
మట్టిలోకి తన గిట్టలతో
నిను తొక్కెయ్యాలని
తరుముకువచ్చే కాలాశ్వంపై
స్వారీ చెయ్

పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర
పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర


ఎడారి దారుల తడారి పోయిన
ఆశకు చెమటల ధారలు పోయ్
ఆ నిస్సత్తువతో నిలబడనివ్వక
ఒక్కో అడుగును ముందుకు వేయ్
వంద ఏళ్ల నీనిండు జీవితం
గండి పడదనే నమ్మకమై
శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు
బ్రతికి ఉండగల సాహసానివై

పరుగులు తీయ్
(పరుగులు తీయ్)
ఉరకలు వేయ్
పరుగులు పరుగులు పరుగులు తీయ్
ఉరకలు ఉరకలు ఉరకలు వేయ్
బిర బిర బిర బిర చర చర చర చర
బిర బిర బిర బిర చర చర చర చర

హరోం హరోం హర హర హర హర
(హరోం హరోం హర హర హర హర)
హరోం హరోం హర హర హర హర
(హరోం హరోం హర హర హర హర)
హరోం హరోం హర హర హర హర
(హరోం హరోం హర హర హర హర)
హరోం హరోం హర హర హర హర
(హరోం హరోం హర హర హర హర)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Parugulu Thiyy« gefällt bisher niemandem.