Songtexte.com Drucklogo

Manasuloni Marmamunu Songtext
von S. P. Balasubrahmanyam & P. Susheela

Manasuloni Marmamunu Songtext

మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో
మాన రక్షకా మరకతాంగ
మాన రక్షకా మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో
మదన కీలగ మరిగిపోక
మదన కీలగ మరిగిపోక
నా మనసులోని మర్మమును తెలుసుకో

ఇనకులాబ్ధ నీవేకాని వేరెవరులేరు
దిక్కెవరు లేరు ఆనంద హృదయా
మనసులోని మర్మమును తెలుసుకో
అనువుగాని ఏకాంతాన ఏకాంతకైనా
ఆ కాంక్ష తగున రాకేందు వదనా
మనసులోని మర్మమును తెలుసుకో


మునుపు ప్రేమగల దొరవై
సదా తనువునేలినది గొప్ప కాదయా
మదిని ప్రేమ కథ మొదలై
ఇలా అదుపుదాటినది ఆదుకోవయా
కనికరమ్ముతో ఈ వేళ ఊఊఊ
కనికరమ్ముతో ఈ వేళ నా కరముబట్టు ఆ
త్యాగరాజ వినుతా
మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో

మరుల వెల్లువల వడినై
ఇలా దరులు దాటితిని నిన్ను చేరగా
మసక వెన్నెలలు ఎదురై
ఇలా తెగువ కూడదని మందలించవా
కలత ఎందుకిక ఈ వేళా ఆఆఆ
కలవరమ్ముతో ఈ వేళ నా కరము వణికే ఆ
ఆగాడాల వనితా

మనసులోని మర్మమును తెలుసుకో
మదనకీలగ మరిగిపోక
మానరక్షక మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & P. Susheela

Fans

»Manasuloni Marmamunu« gefällt bisher niemandem.