Songtexte.com Drucklogo

Em Pilladi Entha Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Em Pilladi Entha Songtext

ఏం పిల్లది ఎంత మాటన్నదీ
ఏం కుర్రది కూత బాగున్నదీ
హోయ్. సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
చెక్కిలి పై కెంపులు తన సొంతం అంది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది

బాగున్నది కొడె ఈడన్నదీ
ఈడందుకే బీడి పాలైనదీ
కమ్మని కల కల్లేదుటకు వచ్చేసింది
కొమ్మకు జత వీడెనని ఒట్టేసింది
ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నదీ
బాగున్నది కొడె ఈడన్నదీ


శనివారం వెంకన్న సామి పేరు జెప్పి
శనగ లడ్డు చేత పెట్టి సాగనంపింది
మంగళవారం ఆంజనేయ సామి పేరు జెప్పి
అసలు పనికి అడ్డమేట్టి తప్పుకున్నది
ఇనుకొని ఆరాటం ఇబ్బంది
ఇడమరిసే ఈలేట్ట ఉంటుంది
ఎదలోనే ఓ మంట పుడుతుంది
పెదవిస్తే అది కూడ ఇమ్మంటుంది
చిరు ముద్దుకు ఉండాలి చీకటి అంది
ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
తీర ముద్దిస్తుంటే ఎంగిలన్నది

ఏం పిల్లది ఎంత మాటన్నది
బాగున్నది కొడె ఈడన్నది


శుకరారం మా లక్ష్మీ నీకు సాటి అంటూ
పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నడు
సోమారం జాము రాతిరి తెల్ల చీర తెచ్చి
మల్లేపూల కాపడలు పెట్టమన్నాడు
ఉత్సాహం ఆపేది కాదంట
ఉబ్బలాటం కసిరేస్తే పొదంట
ఉయ్యాల జంప్పాల కథలోనే
ఊ కొట్టే ఉద్యోగం నాదంట
వరసుంటే వారం తో పని ఏముంది
ఉత్తుతి చొరవైతే ఉడుకేముంది
మళ్ళీ కావలన్న మనసు ఉన్నది
వామ్మో, ఏం పిల్లది ఎంత మాటన్నదీ
బాగున్నది కొడె ఈడన్నదీ
సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
కొమ్మకు జత వీడెనని ఒట్టేసింది
ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
ఏం పిల్లది ఎంత మాటన్నదీ
బాగున్నది కొడె ఈడన్నదీ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Fans

»Em Pilladi Entha« gefällt bisher niemandem.