Songtexte.com Drucklogo

Virisindhee Vasanthaganam Songtext
von K. S. Chithra

Virisindhee Vasanthaganam Songtext

విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మాయ చేసినదీ

విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం రతి వేదం జత కోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించె ఈ వని
ప్రభవించే ఆమని పులకించె కామిని
వసంతుడే చెలికాంతుడై దరిచేరే మెల్లగా


విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా

ఋతువు మహిమేమో విరి తేనే జడి వానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా
రా చిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా నిలువెల్లా ఊగగా
మారుడే సుకుమారుడై జతగూడే మాయగా

విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మాయ చేసినదీ


విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von K. S. Chithra

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Virisindhee Vasanthaganam« gefällt bisher niemandem.