Songtexte.com Drucklogo

Bhadra Shaila Songtext
von Hariharan

Bhadra Shaila Songtext

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

భద్రశైల రాజమందిరా
శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా
(భద్రశైల రాజమందిరా)
(శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా)
వేదవినుత రాజమండలా
శ్రీరామచంద్ర ధర్మకర్మయుగళ మండలా
(వేదవినుత రాజమండలా)
(శ్రీరామచంద్ర ధర్మకర్మయుగళ మండలా)
సతత రామదాస పోషకా
శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేషకా
(భద్రశైల రాజమందిరా)
(శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా)
(బాహుమధ్య విలసితేంద్రియా)
(బాహుమధ్య విలసితేంద్రియా)


కోదండరామ కోదండరామ కోందండరాం
పాహి కోదండరామ
(కోదందరామ కోదండరామ కోందండరాం)
(పాహి కోదండరామ)
నీ దండ నాకు నీ విందుబోకు
వాదేల నీకు వద్దు పరాకు
(కోదందరామ కోదండరామ కోందండరాం)
(పాహి కోదండరామ)
తల్లివి నీవే తండ్రివి నీవే
దాతవు నీవే దైవము నీవే
(కోదండరామ కోదండరామ)
(రామ రామ రామ కోందండరాం)

దశరథరామ గోవింద మము దయజూడు
పాహి ముకుంద
(దశరథరామ గోవింద మము దయజూడు)
(పాహి ముకుంద)
దశరథరామ గోవింద

దశముఖ సంహార ధరణిజపతి రామ
శశిధర పూజిత శంఖచక్రధర
(దశరథరామ గోవింద)
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
(తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు)
ప్రక్క తోడుగా భగవంతుడు
మన చక్రధారియై చెంతనే ఉండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

(జై జై రామా జై జై రామా జగదభిరామా జానకిరామా)
(జై జై రామా జై జై రామా జగదభిరామా జానకిరామా)
(జై జై రామా జై జై రామా జగదభిరామా జానకిరామా)
(జై జై రామా జై జై రామా జగదభిరామా జానకిరామా)
(జై జై రామా జై జై రామా జగదభిరామా జానకిరామా)


పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
(పాహి రామప్రభో పాహి రామప్రభో)
(పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో)
పాహి రామప్రభో
శ్రీమన్మహాగుణస్తోమాభి రామ మీ నామకీర్తనలు
వర్ణింతు రామప్రభో
సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిరా
సంయుతానంద రామప్రభో

(పాహి రామప్రభో)
(పాహి రామప్రభో)
(పాహి రామప్రభో)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Bhadra Shaila« gefällt bisher niemandem.