Songtexte.com Drucklogo

Edo Anukunte Songtext
von Deepu

Edo Anukunte Songtext

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే
మందుంది మనసు బాధకి వదిలేద్దాం కథని కంచికే

అసలీ ప్రేమ దోమ ఎందుకు tell me why?
ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్
ఈ ప్రేమ దోమ ఎందుకు tell me why?

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే

ప్రేమించినా, పెళ్ళాడకూ
Wife ఒక్కటే తోడెందుకూ
మగ వాళ్ళని, timepass అని


అనుకుంటూ వెంట తిరగనీ
మన ఖర్చే వాళ్ళు పెట్టనీ
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ

మరి పెళ్ళి గిల్లి ఎందుకు tell me why? (why? why? why?)
అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్ (సేయ్ సేయ్ సేయ్)
మరి పెళ్ళి గిల్లి ఎందుకు tell me why?

నువ్వొక్కడే, పుట్టావురా
నువ్వొక్కడే పోతావురా
ఆ మధ్యలో, బతకాలిగా

ఆరడుగుల పెళ్ళి గొయ్యికి
ఏడడుగుల తొందరెందుకు
Suicide నేరం వాద్దు మనకి

మరి life గీఫూ ఎందుకు tell me why? (why? why? why?)
నువ్ మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలేయ్ (లేయ్ లేయ్ లేయ్)
ఈ ప్రేమ దోమ ఎందుకు tell me why? (why? why? why?)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Edo Anukunte« gefällt bisher niemandem.