Songtexte.com Drucklogo

Ghallu Ghallu Songtext
von S. P. Balasubrahmanyam & Mallikarjun

Ghallu Ghallu Songtext

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే
చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో
పుడమే పాడగా
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే
చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో
పుడమే పాడగా
హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన
బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్లు తాకి
కడగళ్లే తీరనీ
జడివాన జాడతో ఈ వేళ
జన జీవితాలు చిగురించేలా
రాళ్ల సీమలో ఈ వేళ
రతనాల ధారలే కురిసేలా


(జడివాన జాడతో ఈ వేళ)
(జన జీవితాలు చిగురించేలా)
(రాళ్ల సీమలో ఈ వేళ)
(రతనాల ధారలే కురిసేలా)

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే
చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో
పుడమే పాడగా
రాకాసులు ఇక లేరని
ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖని
ఇపుడే పంపనీ
అన్నెం పున్నెం ఎరగని
మా సీమకి రారమ్మని
ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
తొలగింది ముప్పు అని
నీలి మబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు మునుపు మన ముంగిలంతా
ముత్యాలే చల్లనీ
ఆ శాసు గంధమై నేలంతా
సంక్రాంతి గీతమే పాడేలా
శాంతి మంత్రమై గాలంతా
దిశలన్నీ అల్లనీ ఈ వేళ


(జడివాన జాడతో ఈ వేళ)
(జన జీవితాలు చిగురించేలా)
(రాళ్ల సీమలో ఈ వేళ)
(రతనాల ధారలే కురిసేలా)
భువిపై ఇంద్రుడు పిలిచెరా
వరుణా వరదై పలకరా
ఆకశాన్నే ఇల దించరా
కురిసే వానగా
మారని యాతన తీర్చగా
మా తల రాతలు మార్చగా
ఈ జల యజ్ఞము సాక్షిగా
తలనే వంచరా
మహారాజు కాలి సమిదల్లే మారి
నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి
తాపసిగా నిలిచెరా
జనక్షేమమే తన సంకల్పంగా
తన ఊపిరే హోమజ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా
అమృతములు ఆహ్వానించెనురా

(జడివాన జాడతో ఈ వేళ)
(జన జీవితాలు చిగురించేలా)
(రాళ్ల సీమలో ఈ వేళ)
(రతనాల ధారలే కురిసేలా)

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే
చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో
పుడమే పాడగా
హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన
బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్లు తాకి
కడగళ్లే తీరనీ
జడివాన జాడతో ఈ వేళ
జన జీవితాలు చిగురించేలా
రాళ్ల సీమలో ఈ వేళ
రతనాల ధారలే కురిసేలా

(జడివాన జాడతో ఈ వేళ)
(జన జీవితాలు చిగురించేలా)
(రాళ్ల సీమలో ఈ వేళ)
(రతనాల ధారలే కురిసేలా)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song ist nicht von Britney Spears?

Fans

»Ghallu Ghallu« gefällt bisher niemandem.