Songtexte.com Drucklogo

Nuvvem Maya Chesavo Songtext
von Mani Sarma

Nuvvem Maya Chesavo Songtext

నువ్వేం మాయ చేశావో గాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి
మరీ చిలిపిదీ వయసు బాణి

హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా
చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా
ఎటు పోతుందో ఏమో మరి

నువ్వేం మాయ చేశావో గాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి
మరీ చిలిపిదీ వయసు బాణి

ఔరా పంచకళ్యాణి పైన
వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైన చూశావా మైనా
తెస్తున్నాడా ముత్యాల మేనా


హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా
మొగలిపువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా
మేళతాళాల మనువెప్పుడే

ఔరా పంచకళ్యాణి పైన
వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైన చూశావా మైనా
తెస్తున్నాడా ముత్యాల మేనా

కలా నువ్వు ఏ చాటునున్నా
అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా
ఎలాగైన నిను కలుసుకోనా

హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా
ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా
అది తీరేది ఎపుడన్నది

నువ్వేం మాయ చేశావో గాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి
మరీ చిలిపిదీ వయసు బాణి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Mani Sarma

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Nuvvem Maya Chesavo« gefällt bisher niemandem.